సిద్ధార్థనగర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Bus Accident) జరిగింది. ఓ సైక్లిస్ట్‌ను తప్పించబోయి.. బస్సు డ్రైనేజీలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. బల్రాంపూర్ నుంచి సిద్ధార్ధనగర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 53 మంది ఉన్నారు. సైక్లిస్ట్‌ను రక్షించే క్రమంలో బస్సు అదుపు తప్పి డ్రైనేజీలో పడినట్లు ఎస్పీ ప్రాచీ సింగ్ తెలిపారు. ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆ సైకిల్ తొక్కే వ్యక్తి కూడా మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.