బెంగళూరు: ప్రియురాలు దూరంగా ఉండటంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. తన అనుచరులతో కలిసి ఆమె తల్లిదండ్రులకు చెందిన కార్లకు నిప్పుపెట్టాడు. (Cars Set On Fire) ఆ మహిళ సోదరుడి బైక్‌ను ధ్వంసం చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. డిగ్రీ చదువుతున్న అమ్మాయిని రాహుల్ అనే వ్యక్తి ప్రేమించాడు. అయితే ఇది తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో ఆ మహిళ అతడికి దూరంగా ఉంటున్నది.
కాగా, ప్రియురాలు దూరంగా ఉండటంపట్ల రాహుల్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి వేళ ముగ్గురు సహచరులతో కలిసి ఆ అమ్మాయి తండ్రి ఇంటికి వెళ్లాడు. ఆమెను తనకు దూరంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళ తండ్రి కారుకు నిప్పంటించాడు. ఆమె సోదరుడిపై దాడి చేశాడు. అతడి బైక్‌ను కూడా ధ్వంసం చేశాడు.
మరోవైపు రాహుల్ ఆ తర్వాత ప్రియురాలు తన తల్లితో నివసించే అరెహల్లిలోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఆమె తనతో మాట్లాడకపోవడంతో మరింతగా రెచ్చిపోయాడు. ఆమె తల్లి కారుకు నిప్పంటించాడు. పక్కన పార్క్ చేసిన మరో కారుకు మంటలు వ్యాపించడంతో అది కూడా కాలిపోయింది. సొసైటీ వాచ్‌మెన్‌ను కూడా వారు కొట్టారు. ఆ అపార్ట్మెంట్లోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది.
కాగా, ఈ రెండు సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కేసులు నమోదు చేశారు. రాహుల్, అతడి అనుచరులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రౌడీ షీటర్ అయిన రాహుల్‌పై హత్యాయత్నంతో సహా 18 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 2002 జనవరిలో పోలీసులపై దాడి చేసేందుకు రాహుల్ ప్రయత్నించగా అతడి కాళ్లపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.
A jilted lover / History Sheeter Rahul went on rampage in South Bengaluru, torches 3 cars & damaged a bike after his girlfriend distanced herself from him.Out of 3 gutted cars,2 belonged to Girl’s parents.Police is yet to arrest rahul.. pic.twitter.com/364Ba3hlfa
— Yasir Mushtaq (@path2shah) February 24, 2025