Pension | న్యూఢిల్లీ: వృద్ధుల్లో కేవలం 29 శాతం మందికి మాత్రమే వృద్ధాప్య పింఛను, భవిష్య నిధి వంటి సామాజిక భద్రత పథకాలు అందుతున్నాయని ఎన్జీఓ హెల్ప్ఏజ్ అధ్యయనం వెల్లడించింది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం పొందుతున్నవారు కూడా దాదాపుగా ఇదే సం ఖ్యలో ఉంటారని తెలిపింది. కుటుంబ మద్దతు పొందుతున్న వృద్ధుల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ అని వివరించింది.
పనిలో భాగస్వామ్యం, ఆర్థిక భద్రత, ఆరోగ్యం, సంరక్షణ, సాంఘిక భాగస్వామ్యం, డిజిటల్ యాక్సెస్ సంబంధిత సమస్యలపై ఈ అధ్యయనం జరిగింది. దేశంలోని 10 రాష్ర్టాల్లోని 20 టైర్-1, టైర్-2 నగరాల్లో 5,169 మంది వృద్ధులను, 1,333 మంది కేర్గివర్స్ను ప్రశ్నించి, ఈ నివేదికను రూపొందించారు.