న్యూఢిల్లీ, మార్చి 21: 29 పురాతన విగ్రహాలు, వస్తువులను ఆస్ట్రేలియా భారత్కు అప్పగించింది. వీటిలో శివుడు, విష్ణువు, జైన సంప్రదాయాల ఇతివృత్తాలతో కూడినవి ఉన్నాయి. పాలరాయి, కాంస్యం, ఇత్తడి వంటి పదార్థాలతో వీటిని తయారుచేశారు. 9-10 శతాబ్దాల నుంచి వివిధ కాలాలకు చెందిన వీటిని ప్రధాని మోదీ సోమవారం పరిశీలించారు. విగ్రహాలు తిరిగి ఇచ్చినందుకు వర్చువల్ సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్కు మోదీ కృతజ్ఞతలు చెప్పారు.