శనివారం 28 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 20:31:10

సుడాన్‌కు భారత్‌ ఆహార సాయం

సుడాన్‌కు భారత్‌ ఆహార సాయం

న్యూఢిల్లీ: కరోనాతోపాటు ప్రకృతి వైపరిత్యాలు, అంతర్యుద్ధంతో ప్రభావితమైన సుడాన్‌కు ఆహార సాయం కోసం భారత్‌ చొరవ చూపింది. 270 మెట్రిక్‌ టన్నుల ఆహారాన్ని సుడాన్, దక్షిణ సూడాన్, జిబౌటి, ఎరిట్రియాకు పంపినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 155 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 65 మెట్రిక్ టన్నుల బియ్యం, 50 మెట్రిక్ టన్నుల చెక్కరను  భారతీయ నావికాదళానికి చెందిన అరావాత్‌ నౌకలో రవాణా చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 24న ముంబై నుంచి బయలుదేరిన ఈ నౌక జిబౌటి, మసావా, పోర్ట్ సుడాన్, మొంబాసా వద్ద భారత ఆహార సహాయ సామగ్రిని దిగుమతి చేస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.