న్యూఢిల్లీ: హర్యానా(Haryana)లోని నుహ్ జిల్లాలో హింసాత్మక(Violence) ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి హింస జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. బుల్డోజర్లతో టౌరు ప్రాంతంలో ఉన్న కట్టడాలను తొలగించారు. నుహ్‌లో అల్లర్లకు పాల్పడిన వ్యక్తలకు చెందిన నిర్మాణాలై ఉంటాయని భావిస్తున్నారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాల మేరకు బుల్డోజర్లతో కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది.
#WATCH | Haryana administration removed illegal encroachments in Tauru of Nuh district yesterday pic.twitter.com/t6Do9ibIMg
— ANI (@ANI) August 4, 2023
గతంలో అస్సాంలో ఉన్న బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ శరణార్థులు ఇటీవల హర్యానాలోని అర్బన్ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారు. నుహ్ జిల్లా(Nuh District)లోని టౌరు టౌన్లో ఉన్న మొహమ్మద్ పుర్ రోడ్డు మార్గంలో ఆ గుడిసెలను నిర్మించారు. ఒక్క ఎకరంలోనే అక్కడ సుమారు 250 గుడిసెల్ని కట్టారు. దాదాపు నాలుగేళ్ల నుంచి అక్కడ వాళ్లు ఉంటున్నట్లు తెలుస్తోంది.
భారీ భద్రత మధ్య బుల్డోజర్లతో ఆ నిర్మాణాలను తొలగించారు. స్థానిక పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు కూడా ఆ సమయంలో పహారా కాశాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన ఆఫీసర్లు కూడా పర్యవేక్షణ చేశారు.
ఎస్పీ వరుణ్ బదిలీ..
నుహ్ జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎల్ వరున్ సింగ్లాను ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన్న బివానికి పంపించారు. ఆయన స్థానంలో ఐపీఎల్ నరేంద్ర బిజర్నియాను కొత్త ఎస్పీగా నియమించారు. నుహ్‌లో అల్లర్లు జరిగిన వారం రోజుల్లోనే ఆయన్ను బదిలీ చేశారు. వరుణ్ సింగ్లా 2017 ఐపీఎల్ బ్యాచ్ ఆఫీసర్. ఆయనది హర్యానా కేడర్. అయితే నుహ్‌లో హింస చోటుచేసుకున్న సమయంలో ఆయన లీవ్‌లో ఉన్నట్లు తెలిసింది.