ముంబై: ముంబైలో 25 ఏళ్ల ట్రైనీ ఎయిర్‌హోస్ట్(Air Hostess) అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. అంధేరీలో ఉన్న ఫ్లాట్‌లోనే రక్తపు మడుగులో ఆమె శవమై తేలింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన రూపా ఓగ్రే.. ఏప్రిల్ నుంచి ముంబైలో ఉంటోంది. హెయిర్హోస్ట్గా పనిచేసేందుకు ఎయిర్ ఇండియా సంస్థ ఆమెను ఎంపిక చేసి శిక్షణ ఇస్తోంది. సోదరి ఉంటున్న అంధేరి ఫ్లాట్‌లోనే రూపా ఉంది. అనుమానాస్పద మృతి కింద కేసును బుక్ చేసిన పోలీసులు 12 బృందాలుగా హంతకుడి కోసం వెతుకుతున్నారు. రూపా గొంతు కోసి ఉంది.
ఈ కేసులో ఇంట్లో పనిమనిషిని అరెస్టు చేశారు. హౌజింగ్ సొసైటికి చెందిన సెక్యూర్టీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిన్నటి నుంచి రూపా ఫోన్ ఎత్తకపోవడంతో.. ఆమె తల్లితండ్రులు స్నేహితులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె ఫ్లాట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. డోర్ లోపలి నుంచి లాక్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వాళ్లు పోలీసులకు చెప్పారు. తలుపులు పగలగొట్టిన పోలీసులు.. ఓ రూమ్‌లో రూపా రక్తపు మడుగులో ఉన్నట్లు గమనించారు. హాస్పిటల్‌కు తీసుకువెళ్లినా.. ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ద్రువీకరించారు.