25 Paise Coin Stuck | ఎనిమిదేళ్లుగా శ్వాసనాళంలో 25 పైసల నాణెం.. తొలగించిన డాక్టర్లు
25 Paise Coin Stuck | ఒక వ్యక్తి శ్వాసనాళంలో 25 పైసల నాణెం చిక్కుకుంది. ఎనిమిదేళ్లుగా అక్కడ ఉండిపోయింది. చివరకు దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ ద్వారా ఆ నాణేన్ని బయటకు తీశారు.
లక్నో: ఒక వ్యక్తి శ్వాసనాళంలో 25 పైసల నాణెం (25 Paise Coin Stuck) చిక్కుకుంది. ఎనిమిదేళ్లుగా అక్కడ ఉండిపోయింది. చివరకు దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ ద్వారా ఆ నాణేన్ని బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి విండ్పైప్లో 25 పైసల నాణెం చిక్కుకోవడంతో ఏళ్లుగా ఇబ్బంది పడ్డాడు. బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ)లోని సుందర్లాల్ హాస్పిటల్ డాక్టర్లు దీనిని గుర్తించారు. 8 ఏళ్లుగా ఆ నాణెం శ్వాసనాళంలో చిక్కుకున్నట్లు తెలిసి షాక్ అయ్యారు. కార్డియో-థొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ లఖోటియా, ప్రొఫెసర్ ఎస్కే మాథుర్ నేతృత్వంలోని వైద్యుల బృందం మంగళవారం 20 నిమిషాల పాటు సర్జరీ చేశారు. వ్యక్తి శ్వాసనాళంలో చిక్కుకున్న 25 పైసల నాణేన్ని సురక్షితంగా బయటకు తీశారు.
కాగా, పెద్దల్లో శ్వాసనాళంలోకి వస్తువులు ప్రవేశించడం చాలా అసాధారణమని డాక్టర్లు తెలిపారు. ఎనిమిది ఏళ్లుగా దీనిని గుర్తించలేదన్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రాణహాని కలుగవచ్చని తెలిపారు. ఊపిరితిత్తులను దెబ్బతీయం, న్యుమోనియాకు దారి తీయడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర సమస్యల వల్ల కూడా రోగులు చనిపోయే అవకాశం ఉందని అన్నారు.
మరోవైపు మరో వ్యక్తి శ్వాసనాళంలో పదేళ్లపాటు చిక్కుకున్న అల్మారా తాళంచెవిని కూడా బీహెచ్యూ డాక్టర్లు ఇటీవల విజయవంతంగా బయటకు తీశారు.
Doctors at the Institute of #MedicalSciences, #BHU, have successfully performed a complex surgery to remove a 25 paise coin from a patient's main windpipe. The coin had been stuck in the trachea of this 40 year old patient since last 8 years. #MakingBHUSine pic.twitter.com/KPg51Fxv5C
— BHU Official (@bhupro) July 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

