లక్నో, ఆగస్టు 10: ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించిన యూపీ రాష్ట్రం లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఒక మోస్తరు వర్షానికే కారుతుండటం చర్చనీయాంశమైంది. ఇటీవలి వర్షానికి టెర్మినల్ 3 సీలింగ్ లోని పలు చోట్ల నుంచి నీరు కారుతుండటంతో సిబ్బంది కింద బకె ట్లు, టబ్బులు పెట్టిన దృశ్యం చూసి నెటిజన్లు ఆ ఎయిర్పోర్టును ‘అంతర్ నిర్మిత వర్షపు నీటి సేకరణ వ్యవస్థ’గా పేర్కొంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.
రూ.2,4 00 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి, గత ఏడాది మార్చిలో ప్రారంభించిన ఈ ఎయిర్పోర్టుకు మంచి అభిమాన గణమే ఉంది. కాగా, ఈ ఎయిర్పోర్టు ఏడాదిన్నరకే కారుతుండటం పట్ల దాని నిర్మాణ నాణ్యతపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్లే పై కప్పు కారుతున్నదని ఎయిర్పోర్టు అధికారులు పేర్కొనడం గమనార్హం. అయితే గతంలో కూడా చిన్నపాటి వర్షానికే ఇలా వర్షపు నీరు లీకైన ఘటనలు ఉన్నాయని స్థానిక మీడియా తెలిపింది.