రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో 21 మంది ఐటీబీపీ జవాన్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఐటీబీపీ జవాన్లు మాంసాహారం తిన్నారు. ఆ తర్వాత జవాన్లు అందరికీ వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో అస్వస్థతకు గురైన జవాన్లను మలైదలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జవాన్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సీఎంహెచ్వో డాక్టర్ మిథిలేష్ చౌదరి వెల్లడించారు.
Rajnandgaon, Chhattisgarh | 21 ITBP personnel at a camp in Malaida were hospitalised yesterday following complaints of diarrhoea, vomiting. A day before y'day they had non-vegetarian food for dinner, post which they fell ill. All out of danger now: CMHO Dr Mithilesh Chaudhary pic.twitter.com/LHRokwqyVx
— ANI (@ANI) October 22, 2021