న్యూఢిల్లీ, జూలై 27: మంకీపాక్స్ బాధితులకు 21 రోజుల ఐసొలేషన్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదవగా, పలుచోట్ల అనుమానిత కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం వైరస్‌బారిన పడినవారు, అనుమానితులు, వారి సంబంధీకులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
మూడు పొరల మాస్కును తప్పనిసరిగా ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. మంకీపాక్స్ వైరస్ కారణంగా శరీరంపై ఏర్పడే పుండ్లు, గాయాలు తగ్గేవరకు నిరంతరం దుస్తులతో కప్పి ఉంచుకోవాలని తెలిపింది.