పాట్నా: అల్లరి మూకలు రెచ్చిపోయాయి. దళితుల ఇళ్లలోకి చొరబడి వారిని కొట్టారు. 20కు పైగా దళితుల ఇళ్లకు నిప్పుపెట్టారు. (Dalit homes set on fire) అగంతకులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు బాధిత దళిత కుటుంబాలు ఆరోపించాయి. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడితో సహా 15 మందిని అరెస్టు చేశారు. బీహార్లోని నవాడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దళితులు నివసిస్తున్న భూమిపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఆ ప్రాంతానికి వెళ్లారు. దళితుల ఇళ్లలోకి చొరబడ్డారు. దళిత కుటుంబాలపై దాడులు చేశారు. వారి ఇళ్లకు నిప్పుపెట్టారు. ఆ వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. 21 దళితుల ఇళ్లు మంటలకు కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే గాల్లోకి కాల్పులు జరిగాయన్న ఆరోపణలను ఖండించారు. అక్కడ బుల్లెట్ షెల్స్ లభింలేదని అన్నారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ప్రధాన నిందితుడితో సహా 15 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు.
మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ సంఘటనపై స్పందించారు. సీనియర్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తును పర్యవేక్షించాలని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)ను ఆదేశించారు. అలాగే మరింత దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను కూడా ఏర్పాటు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ విడిచిపెట్టబోమని ఆయన అన్నారు.
The news of Dalit houses being set on fire in Nawada, Bihar is very sad.
According to reports, more than 20+ houses have been set on fire.
This is the jungle raj of Narendra Modi and Nitish Kumar. Where atrocities on Dalits and backward classes have become a common thing. pic.twitter.com/og5O0JSMqE
— Ashish Singh (@AshishSinghKiJi) September 19, 2024