సోమవారం 06 జూలై 2020
National - Apr 16, 2020 , 01:31:22

నిఘా, పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో వ్యవహరించాలి

నిఘా, పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో వ్యవహరించాలి

 
 
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ ను గుర్తించి వారిని  కార్వంటైన్‌ ఐసోలేషన్  కేంద్రాలకు పంపేలా నిఘా, పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిఘా,పర్యవేక్షణ బృందాలతో సంయుక్త కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌ వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాలు రోజువారి నివేదికలు అందించాలన్నారు. పాజిటివ్‌ వ్యక్తులు, అనుమానిత లక్షణాలు ఉన్నవారు, హోం ఐసోలేషన్‌లో ఉన్న విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా  అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి కంటైన్‌మెంట్‌ ప్రాంతానికి నోడల్‌ అధికారిని నియమించి అక్కడ రోజువారిగా జరుగుతున్న ఫీల్డ్  సర్వేలెన్స్, అనుమానితుల శ్వాబ్‌ కలెక్షన్, నిత్యావసర సరుకుల సరఫరా, శానిటైజేషన్‌ కార్యాక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నివేదిక అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారంటైన్‌ ఐసోలేషన్‌ కేంద్రాల్లో శానిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్వారంటైన్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు, కోవిడ్‌ 19 ఆసుపత్రులకు అవసరమైన మెటీరియల్‌పై ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతిపాదనలు అందించాలన్నారు. పాజిటివ్‌ వ్యక్తులు, కాంటాక్ట్స్  వ్యక్తులను, కోవిడ్‌–19 ఆసుపత్రులకు క్వారంటైన్‌ ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించే బాధ్యత డీఎంహెచ్‌వో, ఫీల్డ్  సర్వేలెన్స్, క్వారంటేన్‌ ఐసోలేషన్‌ కేంద్రాల నిఘా, నిర్వహణ బృందాలదే అన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, సంయుక్త కలెక్టర్‌ - 2 శ్రీధర్‌రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి సత్యానారాయణ , నిఘా, నిర్వహణ బృందాల అధికారులు పాల్గొన్నారు.


logo