Mumbai Train Blast | 2006 నాటి ముంబయి రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం కేసును జులై 24న విచారించనున్నది. సబర్బన్ ట్రైన్స్ బ్లాస్ట్ కేసులో 12 మంది నిందితులను హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, బాంబే హైకోర్టు సోమవారం 12 మంది నిందితులను దోషులుగా ప్రకటించింది. కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని కోర్టు పేర్కొంది. జులై 11, 2006న ముంబయి వెస్ట్రన్ లైన్‌లోని పలు ప్రదేశాల్లో రైలులో పేలుళ్లు జరగ్గా 180 మందికిపైగా మరణించారు. ఈ కేసులో నిందితుల్లో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదును విధిస్తూ దిగువ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, నిందితులు కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సైతం నిందితుల పిటిషన్‌ను సవాల్‌చేసింది. 2015 నుంచి పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉన్నది. పలుసార్లు కోర్టు దృష్టికి తీసుకురాగా.. 2024 జులైలో రోజువారి విచారణ కోసం హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే విచారణ జరుపుతూ వచ్చిన కోర్టు సోమవారం అందరినీ దోషులుగా ప్రకటించింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్‌కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని, అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది. 2006 జులై 11న ముంబయి సబర్బన్రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 189 మంది చెందారు. ఈ మారణ హోమంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయంత్రం 6.24 గంటల నుంచి దాదాపు 11 నిమిషాల పాటు ఏడుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఆర్డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్లను ప్రెషర్ కుక్కర్లలో ప్యాక్ చేసి తీసుకెళ్లినట్లు అధికారుల దర్యాప్తుల తేలింది. నిందితులు నిషేధిత సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) సభ్యులుగా మహారాష్ట్ర ఏటీఎస్ పేర్కొంది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)లోని పాకిస్తాన్ సభ్యులతో కుట్ర పన్నినట్లుగా పేర్కొంది.