ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ నివాసంలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. పాటిల్ సిబ్బందిలో 20 మందికి పాజిటివ్ వచ్చింది. గురువారం సాయంత్రం హోంమంత్రి నివాసం సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించారు. ఇవాళ ఆ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్షల్లో మొత్తం 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి కార్యాలయం మీడియాకు వెల్లడించింది.