న్యూఢిల్లీ: పండుగ వేళల్లో రాకపోకలు సాగించే వారి కోసం రైల్వే శాఖ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లో తిరుగు ప్రయాణాల టికెట్లపై 20 శాతం రాయితీ ఇవ్వనుంది. అక్టోబర్ 13-26 మధ్య ప్రయాణించి నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య తిరుగు ప్రయాణాలు చేసే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ నెల 14 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే, రాజధాని, శతాబ్ది, దుర ంతో వంటి ఫ్లెక్సిఫేర్ రైళ్లకు ఈ రాయితీ వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. తొలుత ప్రయాణానికి సంబంధించిన టికెట్‌ను బుక్ చేసుకుని, ఆ తర్వాత కనెక్టింగ్ జర్నీ ఫీచర్‌ను ఉపయోగించి రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే ఇరువైపులా ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్ ఒకటే ఉండి, ఒకే రైలులో ప్రయాణిస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే, ప్రయాణించే తేదీల్లో రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటే ఆఫర్ వర్తించదు.