న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: మరో టెక్ సంస్థ యాహూ కూడా ఉద్యోగుల లే ఆఫ్ ప్రకటించింది. యాడ్ టెక్ డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తమ సంస్థలోని 20 శాతం మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా 50 శాతం యాడ్ టెక్ విభాగం ఉద్యోగులను ఈ ఏడాది ఆఖరులోగా, అందులో వెయ్యి మందిని ఈ వారంలో తొలగిస్తున్నట్టు వివరించింది. 2021లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసిన యాహూలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మాంద్య పరిస్థితుల వల్ల ఆదాయం తగ్గింది. దాంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని యాహూ నిర్ణయించి 20 శాతం మందిని పైగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది.