న్యూఢిల్లీ: ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ జావెద్ హబిబ్(Hair Stylist Javed Habib)తో పాటు ఆయన కుటుంబంపై ఉత్తరప్రదేశ్లో 20 కేసులు నమోదు అయ్యాయి. ప్రజలను కోట్లలో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హబిబ్తో పాటు అతని భార్య, కుమారుడిని దర్యాప్తులో టార్గెట్ చేశామని సంభల్ ఎస్పీ కృష్ణ బిష్ణోయ్ తెలిపారు. సంబంధిత సెక్షన్ల కింద జావెద్ హబిబ్పై కేసులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు ఏడు కోట్ల మేర మోసం జరిగినట్లు భావిస్తున్నారు. హబిబ్ కుటుంబం ఓ గ్యాంగ్ తరహాలో మోసాలకు పాల్పడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. హెయిర్ స్టయిలిస్టుపై 35 మంది ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. హిబిబ్తో పాటు అతని కుమారుడిపై సెప్టెంబర్లో క్రిప్టోకరెన్సీ స్కామ్ కింద కేసు నమోదు చేశామన్నారు. ఫాలికల్ గ్లోబల్ కంపెనీ బ్యానర్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
VIDEO | Sambhal, Uttar Pradesh: Over 20 cases have been registered against hair stylist Javed Habib and his team for allegedly duping people.
Sambhal SP Krishan Bishnoi says, “Javed Habib, his wife, son have been charged under relevant sections, and the police have requested an… pic.twitter.com/ZoLDFuq3rU
— Press Trust of India (@PTI_News) October 8, 2025