చండీఘడ్: పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఆఫీసుపై సోమవారం రాత్రి గ్రెనేడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇవాళ పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సీసీటీవీ ఫూటేజ్‌ను ఇంకా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు వంద మీటర్ల దూరం నుంచి ఆ గ్రెనేడ్‌ను విసిరి ఉంటారని భావిస్తున్నారు. దాడి జరిగిన ఆఫీసు వద్దకు ఇవాళ ఎన్ఐఏ, ఐబీ, ఇతర సెక్యూర్టీ ఏజెన్సీలు వచ్చాయి. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్(ఆర్పీజీ)ను తొలిసారి వాడి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కౌంటర్ టెర్రరిజం నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించి ఇవాళ సీఎం భగవంత్ మాన్ సింగ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన నివాసంలో జరిగిన భేటీకి డీజీపీ హాజరయ్యారు.