Watch: జేఎన్‌యూలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. కర్రలు చేతపట్టి విద్యార్థులు హంగామా
తపతి హాస్టల్‌కు చెందిన కొందరు విద్యార్థులు మరో హాస్టల్‌కు చెందిన విద్యార్థులతో గురువారం గొడవ పడ్డారు. దీంతో రెండు గ్రూపుల మధ్య ఫైట్ జరిగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు కర్రలు చేతపట్టి హంగామా చేశారు. తపతి హాస్టల్‌కు చెందిన కొందరు విద్యార్థులు మరో హాస్టల్‌కు చెందిన విద్యార్థులతో గురువారం గొడవ పడ్డారు. దీంతో రెండు గ్రూపుల మధ్య ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా కర్రలతో వారు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో ఘర్షణకు దిగిన విద్యార్థులు పారిపోయారు. అయితే ఇద్దరు విద్యార్థుల మధ్య వ్యక్తిగత ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ గొడవకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు. ఎవరి నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులు కర్రలు చేతపట్టి హంగామా చేస్తున్న వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
On Camera, Men Seen Walking With Sticks At JNU, Clash Between 2 Groups https://t.co/kFprI2WJWq pic.twitter.com/To6b4dw3Sb
— NDTV (@ndtv) November 10, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

