Mumbai | అది ముంబైలోని బాంద్రా – వోర్లి సీ లింక్ రహదారి.. కార్లన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి. ఓ వ్యాపారవేత్త కూడా తన కారులో వేగంగా వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ఓ పక్షి ఆ బిజినెస్మెన్ కారు కింద పడిపోయింది. దీంతో ఆకస్మాత్తుగా కారును డ్రైవర్ నిలిపివేశాడు. వ్యాపారవేత్త అమర్ మనీష్ జరివాలా(43), డ్రైవర్ శ్యాం సుందర్ కామత్ కారు దిగి.. గాయపడ్డ పక్షిని పరిశీలిస్తున్నారు.
అంతలోనే వేగంగా దూసుకొచ్చిన ట్యాక్సీ.. జరివాలాతో పాటు డ్రైవర్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో వ్యాపారవేత్త మరణించాడు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కామత్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరి మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ రవీంద్ర కుమార్ జైశ్వర్(30)పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన మే 30వ తేదీన మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
What a tragedy. This is Mumbai’s Bandra Worli Sea Link pic.twitter.com/VSTQz27vqY
— Singh Varun (@singhvarun) June 10, 2022