Men Beaten To Death | మాజీ సైనికుడిపై కాల్పులు జరిపి హత్య.. ఇద్దరిని కొట్టి చంపిన జనం
Men Beaten To Death | బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మాజీ సైనికుడిపై కాల్పులు జరిపి చంపారు. వారు పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దారుణంగా కొట్టగా ఇద్దరు మరణించారు. (Men Beaten To Death) మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
పాట్నా: బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మాజీ సైనికుడిపై కాల్పులు జరిపి చంపారు. వారు పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దారుణంగా కొట్టగా ఇద్దరు మరణించారు. (Men Beaten To Death) మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 9.45 గంటలకు కళ్యాణి గ్రామం సమీపంలో 55 ఏళ్ల మాజీ సైనికుడు, గతంలో సర్పంచ్‌గా పోటీ చేసిన బిజేంద్ర సింగ్‌పై బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.
కాగా, ఇది చూసిన స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒక దుండగుడు కాల్పులు జరుపగా గ్రామస్తుడు అంకిత్ కుమార్ గాయపడ్డాడు. దీంతో గ్రామస్తులు మరింతగా రగిలిపోయారు. ముగ్గురిని దారుణంగా కొట్టారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనం దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతులను 23 ఏళ్ల మిథిలేష్ కుమార్, 25 ఏళ్ల ఆదిత్య కుమార్‌గా గుర్తించారు. మూడో దుండగుడు అజిత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

