భోపాల్: కొందరు వ్యక్తులు కాలేజీ అమ్మాయిలతో స్నేహం చేశారు. వారికి గిఫ్ట్‌లు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డారు. రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్మెయిల్ చేశారు. (Raping, Blackmailing College Students) మతం మారి తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులతో ఇద్దరు యువకులు ఫ్రెండ్షిప్ చేశారు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మతం మారి తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు.
కాగా, ఏప్రిల్ ఆరంభంలో 19 ఏళ్ల బాధిత యువతి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులైన ఫర్హాన్, సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో, ఐటీ, బీఎస్ఎస్ చట్టంతోపాటు మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టంలోని సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు.
మరోవైపు ఈ ముఠా ఇతర విద్యార్థులను కూడా టార్గెట్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే భయం, ఇతర కారణాలతో ఫిర్యాదు చేసేందుకు వారు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.