Army Helicopter Crash | రెండు మృతదేహాలు లభ్యం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Helicopter Crash | ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న ఐదుగురి కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న ఐదుగురి కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ముగ్గురి జాడ కోసం గాలింపు జరుగుతున్నది.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా మారింది. వాయు మార్గాన, లేదంటే వేలాడే వంతెన గుండా నడుచుకుంటూ మాత్రమే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దాంతో ఏరియల్ రెస్క్యూ టీమ్స్ ఒక మిగ్-17, రెండు ధృవ్ హెలికాప్టర్లతో ప్రమాద ప్రాంతానికి వెళ్లాయి.
ఇద్దరు జవాన్లు హెలికాప్టర్ కూలిన చోటుకు చేరుకుని రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ మృతదేహాలను అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఉదయం 10:43 గంటలకు సియాంగ్ జిల్లాలోని మిగ్గింగ్ గ్రామానికి సమీపంలో ఆర్మీకి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కుప్పకూలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

