foetus in infant’s stomach | పసికందు కడుపులో పిండం.. సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
foetus in infant’s stomach | ఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండం ఉన్నది (foetus in infant’s stomach). వైద్య పరీక్షల ద్వారా దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు.
లక్నో: ఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండం ఉన్నది (foetus in infant’s stomach). వైద్య పరీక్షల ద్వారా దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్‌గఢ్ జిల్లా కుంట ప్రాంతానికి చెందిన రైతు భార్య కొన్ని నెలల కిందట ఒక బాబుకు జన్మనిచ్చి చనిపోయింది. ప్రస్తుతం ఏడు నెలల వయసున్న ఆ పసికందు కడుపు ఉబ్బుతున్నది. దీంతో కడుపు నొప్పితో బాబు అల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో జూలై 24న తండ్రి ఆ శిశువును స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు ఆ పసికందు కడుపులో పిండం పెరుగుతున్నట్లు గ్రహించారు.
కాగా, ప్రయాగ్‌రాజ్‌లోని సరోజినీ నాయుడు పిల్లల ఆసుపత్రి డాక్టర్లు కూడా ఆ శిశువును పరిశీలించారు. ఆ పసి బాబు కడుపులో రెండు కిలోల బరువున్న పిండం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ కుమార్ నేతృత్వంలోని వైద్యుల బృందం సర్జరీ చేశారు. నాలుగు గంటలు శ్రమించి ఆ చిన్నారి కడుపులోని పిండాన్ని తొలగించారు. శిశువు కడుపులో పిండం ఉండటం చాలా అరుదైన సంఘటన అని డాక్టర్ కుమార్ తెలిపారు. తల్లి గర్భంలో కవలలు ఏర్పడినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఒక పిండం కవల పిల్ల కడుపులో పెరుగుతుందని అన్నారు. వైద్యపరంగా ఫీటస్ ఇన్ ఫీటూ అని వ్యవహరిస్తారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

