మంగళవారం 14 జూలై 2020
National - Jun 14, 2020 , 17:26:40

సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు..

సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు..

లక్నో: ముఖ్యమంత్రి అధికార నివాసంతోపాటు 50 భవనాలను పేల్చివేస్తామంటూ వచ్చిన ఓ మొబైల్‌ మెసేజ్‌పై పోలీసులు స్పందించారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ అధికార ఇంటితోపాటు లక్నోలోని 50 భవనాలను బాంబులతో పేల్చేస్తామంటూ ఆ రాష్ట్రానికి చెందిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 112కు శనివారం ఓ సందేశం వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు గోండా జిల్లాలోని ఛాపియా పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఇద్దరిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. వీరిద్దరు సోదరులని ఎస్పీ రాజ్‌కరన్‌ నయ్యర్‌ తెలిపారు. అన్న స్వదేశ్‌ గౌర్‌ తన మొబైల్‌ నుంచి ఈ బెదిరింపు సందేశాన్ని పంపగా, తమ్ముడు మనీశ్‌ ఆధారం లేకుండా చేశాడని పేర్కొన్నారు. వీరిద్దరు తమ నేరాన్ని అంగీకరించారని ఆయన చెప్పారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. logo