కాట్రా: జమ్మూకశ్మీర్‌లోని కాట్రా బేస్ క్యాంప్ వద్ద రోప్‌వే ప్రాజెక్టు(Vaishno Devi Ropeway Project)ను చేపట్టాలని నిర్ణయించారు. ట్రెక్కింగ్ రూట్లో ఆ రోప్‌వే నిర్మించాలనుకున్నారు. కానీ రియాజీ జిల్లాకు చెందిన కార్మికులు, షాపు ఓనర్లు.. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భూపిందర్ సింగ్, సోహన్ చాంద్ నేతృత్వంలోని ఆందోళనకారులు.. ప్రతిపాదిత రోప్‌వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అయితే వాళ్లను పోలీసులు అడ్డుకోవడంతో.. ఘర్షణలు తలెత్తాయి. సింగ్, చాంద్‌ను అరెస్టు చేశారు. సోమవారం జరిగిన ఘర్షణకు చెందిన ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ప్రదర్శన చేపట్టారు.