Men Stripped, Paraded | మొబైల్ ఫోన్ చోరీ ఆరోపణ.. దళిత వ్యక్తులను కొట్టి, దుస్తులు విప్పించి ఊరేగింపు
Men Stripped, Paraded | మొబైల్ ఫోన్ చోరీ ఆరోపణలపై గ్రామస్తులు దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు దళిత వ్యక్తులను కట్టేసి కొట్టారు. ఆ తర్వాత వారి దుస్తులు విప్పించి అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.
చండీగఢ్: మొబైల్ ఫోన్ చోరీ ఆరోపణలపై గ్రామస్తులు దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు దళిత వ్యక్తులను కట్టేసి కొట్టారు. ఆ తర్వాత వారి దుస్తులు విప్పించి అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. (Men Stripped, Paraded) పంజాబ్‌లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఝోరార్ గ్రామానికి చెందిన ఇద్దరు దళిత యువకులు వలస కూలీ నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేసినట్లు ఆ గ్రామంలోని కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి వారిని లాక్కెళ్లారు. తాళ్లతో వారిని కట్టేసి కొట్టారు. అంతటితో ఆగక ఆ యువకుల దుస్తులు విప్పించి వారిని అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో గ్రామస్తుల చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు స్పందించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ కూడా దీనిపై స్పందించింది. జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

