బెలగావి: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 2.84 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. బీజాపూర్ సిటీ ఎమ్మెల్యే బసన్నగౌడ్ పాటిల్ యత్నాల్ అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇస్తూ అత్యధికంగా పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖలో 79,694 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఒక పక్క రాష్ట్రంలోని నిరుద్యోగులకు గరిష్ఠ వయసు పరిమితి దగ్గరపడుతున్నదని, మరో పక్క ఉద్యోగ నియామక సంస్థ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి కారణంగా అర్హులైన అభ్యర్థుల భవిష్యత్ తీవ్ర ప్రమాదంలో పడిందని యత్నాల్ ట్వీట్ చేశారు.