న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆస్తుల వివరాలు(Property Details) వెల్లడించని సుమారు 2.5 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. ఆన్లైన్లో ప్రాపర్టీ డిటేల్స్ ఇవ్వాలని ఇటీవల యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దాని ప్రకారమే కొందరు ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. కానీ వివరాలు వెల్లడించని 2,44,565 మంది ఉద్యోగులు ఆగస్టు నెల జీతాలను నిలిపిఏవశారు. అన్ని శాఖలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా, ఆగస్టు నెల జీతాన్ని హోల్డ్‌లో పెట్టినట్లు ప్రభుత్వం చెప్ఇపంది.
ప్రాపర్టీ డిటేల్స్ వెల్లడించేందుకు మానవ్ సంపద పోర్టల్‌ను యూపీ సర్కారు స్టార్ట్ చేసింది. ఆ పోర్టల్‌లో ఆగస్టు 31వ తేదీ వరకు ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను తెలుపాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 71 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమాచారాన్ని పొందుపరిచారు. ఐఏఎస్, ఐపీఎస్, పీపీఎస్, పీసీఎస్ ఆఫీసర్ల తరహాలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ప్రాపర్టీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
టీచర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, అటానమస్ సంస్థల ఉద్యోగులను మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయించారు.