భోపాల్: మధ్యప్రదేశ్లో తీవ్రమైన కడుపునొప్పితో దవాఖానలో చేరిన ఒక మహిళకు స్కానింగ్ చేసిన డాక్టర్లు విస్తుపోయారు. ఏకంగా 2.5 కిలోల వెంట్రుకలు ఉండచుట్టుకుని ఆమె గర్భంలో ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ 25 ఏండ్ల మహిళకు ఆపరేషన్ చేసి వెంట్రుక ఉండను బయటకు తీశారు. ఆ బాధిత మహిళకు వెంట్రుకలు తినే అలవాటు ఉందని, అందుకే ఆమె గర్భంలో పెద్దయెత్తున జుట్టు పేరుకు పోయిందని డాక్టర్లు తెలిపారు.