పరోటా, చపాతీ.. బోత్ ఆర్ నాట్ సేమ్!
పరోటా, చపాతీ రెండూ ఒకటి కాదని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్ (జీఏఏఏఆర్) తేల్చి చెప్పింది.
- ప్యాకేజ్జ్ పరోటాపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే
- ఏఏఆర్ ఆర్డర్‌ను సమర్థించిన జీఏఏఏఆర్ బెంచ్
గాంధీనగర్, అక్టోబర్ 13: పరోటా, చపాతీ రెండూ ఒకటి కాదని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్ (జీఏఏఏఆర్) తేల్చి చెప్పింది. ప్యాకేజ్జ్ పరోటాపై 18శాతం జీఎస్టీ కట్టాల్సిందేనన్న అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్ ఆర్డర్ (ఏఏఆర్)ను సమర్థించింది. ఏఏఆర్ ఆర్డర్‌పై వాడిలాల్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను వివేక్ రంజన్, మిలింద్ తొరవానే బెంచ్ గురువారం విచారించింది. తమ సంస్థ మలబార్, మిక్స్డ్ వెజిటెబుల్, సాదా పరోటాలను గోధుమపిండి ఉపయోగించి తయారుచేస్తుందని, వీటికి కూడా చపాతీలాగా 5శాతం జీఎస్టీ మాత్రమే విధించాలని వాడిలాల్ ఇండస్ట్రీస్ పిటిషన్లో పేర్కొంది. రుచికోసం కొన్ని పరోటాల్లో కూరగాయలు, ఉల్లిగడ్డ, మెంతికూర కలుపుతామని చెప్పింది. కాగా, పరోటాల్లో గోధుమ పిండిని వాడినా నేరుగా తినలేమని, మూడు నిమిషాలు వేడిచేయాల్సి ఉంటుందని బెంచ్ తెలిపింది. పరోటాలపై 18శాతం జీఎస్టీ విధించాలనే ఆర్డర్ సరైనదేనని తీర్పు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gst
- GST Rate
- package parcels
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

