Madhya Pradesh | ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్లో ఓ మైనర్ భార్య (17) తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతుడు గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్ (25)కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పాండే మృతదేహం ఆదివారం కనిపించింది. ఆయన భార్య కనిపించకపోవడంతో పోలీసులు ఆమె ప్రమేయం గురించి అనుమానించారు.
మైనర్ భార్యతోపాటు ఆమె ప్రియుడు యువరాజు, అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు నేరాన్ని అంగీకరించారు. షాపింగ్‌కు వెళ్లిన దంపతులు మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్ వద్ద టిఫిన్ చేశారు. అనంతరం ఇరువురు బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో తన చెప్పు కింద పడిపోయిందని మైనర్ భార్య తన భర్తతో చెప్పింది.
దీంతో పాండే బైక్‌ను ఆపాడు. వెంటనే ఆమె స్నేహితులిద్దరితో కలిసి, పాండేను పగిలిన బీరు సీసాతో 36 సార్లు పొడిచారు. పాండే అక్కడికక్కడే మరణించాడు. అనంతరం మృతదేహాన్ని యువరాజుకు వీడియోకాల్‌లో చూపించారు. మృతదేహాన్ని పొలాల్లో విసిరేసి, పారిపోయారు.