న్యూఢిల్లీ : సంసద్ రత్న అవార్డు 2025కు ఎంపీలు భర్తృహరి మహతాబ్, రవి కిషన్ సహా 17 మంది పార్లమెంట్ సభ్యులు, రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఎంపిక చేశారు. పార్లమెంట్‌కు సభ్యులు చేసిన కృషి ఆధారంగా ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను అందజేస్తుంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యుత్తమ, స్థిరమైన సహకారం అందించిన మహతాబ్, సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ), ఎన్కే ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ) శ్రీరంగ్ అప్పా బర్నేలు ఈ అవార్డులు దక్కించుకున్నారు.