Aligarh Muslim University : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లీం యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ సమ్మెకు దిగారు. జీతాలు చెల్లించకపోవడంతో వాళ్లు శాంతియుతంగా ధర్నా చేపడుతున్నారు. వీళ్ల ధర్నా రెండో రోజు కూడా కొనసాగింది. నవంబర్ నెల జీతం చెల్లించకపోవడంతో దాదాపు 16,00 మంది శుక్రవారం ధర్నాకు దిగారు. వీళ్లలో చాలామంది తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగంలో చేరినవాళ్లే. వీళ్లకు రోజూవారీగా వేతనం ఇస్తారు. తమకు వెంటనే జీతాలు ఇవ్వాలని వీళ్లంతా వైస్ ఛాన్స్లర్ ఆఫీసు ముందు శనివారం బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలియజేశారు. అయితే.. నిరసన కారులను క్యాంపస్‌లోకి అనుమతించకుండా ప్రవేశ మార్గం దగ్గర భద్రత పెంచినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
దాదాపు 16వందల మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌కు పోయిన నెల జీతం అందలేదు. వీళ్లలో చాలామంది తాత్కాలిక ఉద్యోగులని, వీళ్లు పదేళ్లకు పైగా ఇక్కడ పనిచేస్తున్నారనిఇ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీ రిహన్ అహ్మద్ వెల్లడించాడు. ధర్నాకు దిగిన ఉద్యోగుల ప్రతినిధులు యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించేదుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని యూనిర్సిటీ క్రమశిక్షణ సంఘం అధికారి మొహమ్మద్ వసీం వెల్లడించాడు.