న్యూఢిల్లీ: భూమిపైగల ప్రజలు 2024వ సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వాగతం పలికారు. కానీ అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు 16 సార్లు ఈ అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ఐఎస్ఎస్ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుండటమే. ఐఎస్ఎస్ భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 90 నిమిషాలు పడుతుంది. అంటే, దీనిలోని వ్యోమగాములు 24 గంటల సమయంలో 16 సూర్యోదయాలను, 16 సూర్యాస్తమయాలను చూడగలుగుతారు. భూమి మీద పగటి సమయం 12 గంటలు కాగా, అంతరిక్షంలో తిరుగుతున్న ఐఎస్ఎస్లోని వ్యోమగాములకు కేవలం 45 నిమిషాలు మాత్రమే. అదే విధంగా రాత్రి సమయం కూడా ఉంటుంది.