డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని దయారా బుగ్యాల్ అడవుల్లో ట్రెక్కింగ్(Trekking) వెళ్లిన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని ఆచూకీ లేకుండాపోయింది. ఆరు రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఉత్తరకాశీలో ట్రెక్కింగ్‌కు వెళ్లి అదృశ్యమైంది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. బబితా పాండే ఫ్యామిలీ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె ఆనవాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫ్రెండ్స్ హర్మన్‌పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురూ మే 25వ తేదీన డెహ్రాడూన్ వెళ్లారు. ఆ తర్వాత హర్సిల్, గంగోత్రి విజిట్ చేశారు. మే 28వ తేదీన రైతాల్ గ్రామానికి వెళ్లారు. అక్కడ స్టే చేశారు. రైతాల్లోని సీసీటీవీకి ఆ ముగ్గురు చిక్కినట్లు పోలీసులు చెప్పారు.
మరుసటి రోజు రైతాల్ నుంచి దయారా బుగ్యాల్‌కు ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. గోయి బేస్ క్యాంపు వద్ద రాత్రి బస చేశారు. అయితే అర్థరాత్రి సమయంలో పాండే క్యాంపు నుంచి అదృశ్యమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 150 మంది ప్రత్యేక సిబ్బంది ఆమె కోసం వెతుకుతున్నారు. ఆర్మీ, ఇండో టిబెట్ బోర్డర్ పోలీసు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అటవీశాక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. స్నిఫర్ డాగ్స్, డ్రోన్ల ద్వారా కూడా అన్వేషఙస్తున్నారు. అక్కడ దట్టమైన అడవి సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ట్రెక్కింగ్ రూట్లు, గుహలను పరిశీలిస్తున్నారు. గోయి క్యాంపు వద్ద ఉన్న ఓ సరస్సులో ఆరు మంది డైవింగ్ బృందం వెతుకుతున్నారు. సోషల్ మీడియా ఆ అమ్మాయి ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు.