ముంబై : మహారాష్ట్రను ఒమిక్రాన్ వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. నిన్నటి వరకు ఒక్క మహారాష్ట్రలోనే 450 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ముంబై ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 141 మందిలో 93 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారున్నారు.
ఇందులో 21 మంది కేవలం కే వెస్ట్ వార్డు నుంచి ఉన్నారు. అంధేరి వెస్ట్, జూహు, వేర్సోవా, డీ వార్డులో ఈ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ముంబైలో 153 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇందులో 12 మంది మాత్రమే ఇంటర్నేషనల్ ప్యాసింటర్స్ ఉన్నారని బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజధాని ముంబైలోని ఒమిక్రాన్ కేసుల సంఖ్య 290కి చేరింది.