న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతంలో పద్నాలుగేండ్ల రాజేశ్వరి అరుదైన చర్మ వ్యాధితో బాధ పడుతున్నది. ఆ బాలిక శరీరం క్రమంగా గట్టి పడుతున్నది, చర్మం దళసరిగా, , పగుళ్లు వస్తున్నాయి. దీంతో ఆమె నడవడం, కూర్చోవడం, నిలబడటం వంటివి చాలా కష్టంగా మారింది.
ఆమె దుస్థితిని తెలిపే వీడియో 2025 డిసెంబర్లో మరోసారి సామాజిక మాధ్యమాలకు వచ్చింది. తన కాళ్లు, చేతులు ఏ విధంగా కఠినంగా మారిపోయాయో రాజేశ్వరి ఈ వీడియోలో వివరించింది.