Carrot Halwa: ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తరచూ కలుషిత ఆహార ఘటనలు (Food Poisoning) చూస్తున్నాం. తాజాగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోనూ ఫుడ్‌పాయిజన్ చోటుచేసుకున్నది. ఓ అధికారి పుట్టిన రోజు సందర్భంగా వడ్డించిన స్వీట్ తిన్న (Carrot Halwa) పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ఘటన జరిగింది రాజస్థాన్‌లోని జైపూర్‌లో.
జైపూర్‌లోని లాల్ కోఠి ప్రాంతంలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఓ అధికారి బర్త్‌డే పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఓ ప్రముఖ షాప్ నుంచి స్వీట్స్ తెప్పించారు. అందులో క్యారట్ హల్వా కూడా ఉన్నది. దానిని ఇష్టంగా తిన్న 12 మంది పోలీసులు కొద్ది సేపట్లోనే అస్వస్థతకు గురయ్యారు. వామ్టింగ్, కడుపునొప్పి, తలరిగడం వంటి లక్షణాలతో దవాఖానలో చేరారు. వారిని పరిశీలించిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తునకు ఆదేశించారు. స్వీట్స్ తీసుకొచ్చిన షాప్‌ను సీజ్ చేశారు.