న్యూఢిల్లీ: దేశంలో 10 వేల కిలోమీటర్ల మేర ‘డిజిటల్ హైవే’లను అభివృద్ధి చేసే దిశగా తాము పని చేస్తున్నామని జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. ఇందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి దాదాపు 10 వేల కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రణాళికలో ఉన్నదని తెలిపింది.
ఈ డిజిటల్ హైవేల అభివృద్ధి కోసం 1,367 కి.మీ, ఢిల్లీ-ముంబై, 512 కి.మీ హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను పైలట్ రూట్లుగా గుర్తించినట్టు తెలిపింది. ఎన్హెచ్ఏఐ అధ్వర్యంలోని ఎన్హెచ్ఎల్ఎంఎల్ ఓఎఫ్సీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల వెంట ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ కారిడార్లను అభివృద్ధి చేయడం ద్వారా డిజిటల్ హైవేస్ నెట్వర్క్ను అమలు చేయనున్నదని పేర్కొన్నది.