లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ను జికా వైరస్ వణికిస్తున్నది. ఆదివారం ఆ జిల్లాలో కొత్తగా మరో పది కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం జికా కేసుల సంఖ్య 89కి చేరింది. కాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ సింగ్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. జికా వైరస్ కేసుల నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలో శానిటైజేషన్ చేయించడంతోపాటు ఇంటింటి నుంచి నమూనాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. జికా వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కాగా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ అంశంపై సీరియస్గా దృష్టిసారించారు. కరోనా నియంత్రణకు అనుసరించిన ట్రేస్, టెస్ట్, క్యూర్ విధానాలను జికా వైరస్ నియంత్రణకు పాటించాలని అధికారులను ఆదేశించారు.