న్యూఢిల్లీ, నవంబర్ 2: అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ప్రైమ్ సబ్‌స్ర్కైబర్లకు 10 కోట్ల పాటలను షఫుల్ మోడ్‌లో అందించనున్నామని ప్రకటించింది. సరికొత్త ఫీచర్లు, యాడ్లు లేకుండా సంగీతాన్ని విని ఆనందించొచ్చని పేర్కొన్నది. ఇప్పటి వరకు ప్రైమ్ మెంబర్లకు అందిస్తున్న 20 లక్షల పాటల మ్యూజిక్ కేటలాగ్‌ను 10 కోట్లకు విస్తృతం చేస్తూ అమెజాన్ తాజా నిర్ణయం తీసుకొన్నది.
యూజర్లు ఇప్పుడు తమకు ఇష్టమైన సాంగ్స్ వినొచ్చని.. నచ్చిన, ట్రెండింగ్‌లో ఉన్న పాటలను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తర్వాత ఇంటర్నెట్ లేకున్నా ఆఫ్‌లైన్‌లో కూడా ఆ పాటలను వినొచ్చని పేర్కొన్నది.