సహోద్యోగులపై సీఐఎస్ఎఫ్ జవాన్ కాల్పులు… ఒకరు మృతి
కోల్‌కతా: ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తన సహోద్యోగులపై గన్‌తో కాల్పుడు జరిపాడు. దీంతో ఒకరు మరణించగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. అక్కడి ఇండియన్ మ్యూజియం భద్రతను 2019 డిసెంబర్ నుంచి సీఐఎస్ఎఫ్ చూస్తున్నది. కాగా, శనివారం సాయంత్రం 6.30 గంటలకు అక్కడి బ్యారెక్ వద్ద ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ సహోద్యోగులులైన ఏఎస్పీ, హెడ్ కానిస్టేబుల్‌పై సర్వీస్ గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో రంజిత్ కుమార్ సారెంగి మరణించగా మరొక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
అలాగే ఒక పోలీస్ వాహనంపైనా ఆ జవాన్ కాల్పులు జరిపాడు. దీంతో వాహనం డ్రైవర్‌తోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. చివరకు ఆ జవాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి గన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కోల్‌కతా నడిబొడ్డున ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఇండియన్ మ్యూజియం వద్ద జరిగిన ఈ కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

