న్యూఢిల్లీ, జూలై 23 : సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 1.09 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రకటించారు.
సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర పారామిలిటరీ బలగాల్లో పెద్దయెత్తున ఖాళీలున్నాయా? అన్న ప్రశ్నకు లేదని సమాధానం చెప్పారు. కేంద్ర బలగాల్లో నియామకాలు నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు.