ప్రాణ్పుర: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు భారత మాజీ నిఘా అధికారిగా చెప్తున్న వికాశ్ యాదవ్ కుట్ర పన్నారని వచ్చిన ఆరోపణలను అతడి కుటుంబం ఖండించింది. ఎఫ్‌బీఐ వికాస్‌ను విచారణకు కోరడం తమకు షాక్ కలిగించిందని తెలిపింది. వికాశ్‌పై వచ్చిన ఆరోపణలన్నీ మీడియా సృష్టేనని ఆయన పిన తండ్రి కొడుకు అవినాశ్ యాదవ్ తెలిపారు. వికాశ్ భారత గూఢచార అధికారి అని అమెరికా గురువారం తన అభియోగ పత్రంలో పేర్కొంది. పన్నూ హత్య కోసం నిఖిల్ గుప్తా అనే భారతీయుడికి వికాశ్ రూ.12 లక్షలు చెల్లించారని ఆరోపించింది. దీనికి భారత్ స్పందిస్తూ అతడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కాదని.. అతడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.
నాగ్‌పూర్ నైరుతి నుంచి ఫడ్నవీస్ పోటీ ;99 మందితో బీజేపీ తొలి జాబితా
ముంబై, అక్టోబర్ 20: మరో నెలరోజుల్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 99 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఇందులో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బవాంకులే, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తదితరుల పేర్లు ఉన్నాయి. నాగ్‌పూర్ (నైరుతి) స్థానం నుంచి ఫడ్నవీస్, కామ్తీ నియోజకవర్గం నుంచి బవాంకులే, కొలాబా స్థానం నుంచి నార్వేకర్ పోటీ చేయబోతున్నారు. మంత్రి సుధీర్ ముగంటివార్, మాజీ సీఎం అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ అశోక్ చవాన్ తదితరులకు బీజేపీ టికెట్లు ఇచ్చింది.
‘