నేడు సాయితేజ అంత్యక్రియలు

- శనివారం ఆరుగురు సైనికుల గుర్తింపు
- ఇంకా విషమంగానే వరుణ్ ఆరోగ్యం
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సైనికుడు లాన్స్‌నాయక్ సాయితేజ భౌతిక కాయాన్ని అధికారులు శనివారం గుర్తించారు. సైనిక లాంఛనాలు నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సాయితేజ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని ఎలహంక ఎయిర్‌ఫోర్సు బేస్‌కు పంపించారు. ఆదివారం ఉదయం అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం ఎగువరేగడికి తరలించనున్నారు. ఆదివారం ఎగురరేగడిలోనే సాయితేజ అంత్యక్రియలు జరుగుతాయి. ఇదిలా ఉండగా, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13 మందిలో ఇప్పటికే రావత్ దంపతులు, లిద్దర్ మృతదేహాలను గుర్తించి అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం సాయితేజ సహా ఆరుగురిని గుర్తించారు. గుర్తించినవారందరి భౌతిక కాయాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, ప్రమాదంలో తీవ్ర గాయాలైన వరుణ్ సింగ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది.
గంగమ్మ ఒడికి రావత్ అస్థికలు
బిపిన్ రావత్, మధూలిక రావత్‌ల అస్థికలను, చితాభస్మాన్ని వారి కుమార్తెలు శనివారం హరిద్వార్‌లోని గంగానదిలో కలిపారు. రావత్ దంపతులకు శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్కేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు, బిపిన్ రావత్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. రావత్‌ను అగౌరవపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
శనివారం గుర్తించిన సైనికులు
- లాన్స్ నాయక్ బీ సాయితేజ
- లాన్స్ నాయక్ వివేక్ కుమార్
- జూనియర్ వారంట్ ఆఫీసర్ ప్రదీప్
- జూనియర్ వారంట్ ఆఫీసర్ ప్రతాప్ దాస్
- వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్
- స్కాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్
- ఇంకా గుర్తించని మృతదేహాలు
- లెఫ్టినెంట్ కర్నల్ హర్జీందర్ సింగ్
- నాయక్ గురుసేవక్ సింగ్
- నాయక్ జితేంద్ర కుమార్, హవల్దార్ సత్పాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

