తిరువనంతపురం: కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి గురువారం భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మండల-మకరజ్యోతి వార్షిక పూజల కోసం ఈ దేవాలయాన్ని శుక్రవారం తెరవబోతుండటంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం వందలాదిగా తరలివచ్చారు. శబరిమల యాత్ర సీజన్ 41 రోజులపాటు ఉంటుంది.