శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన పాక్ సైన్యం పన్నాగాన్ని భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టింది. అయిదుగురు చొరబాటుదారులను మట్టు బెట్టినట్టు సైన్యం వెల్లడించింది. కృష్ణ ఘాటి ప్రాంతంలో మంగళవారం రోజంతా పాక్ సైనికులు, చొరబాటుదారుల కాల్పులను సమర్థంగా తిప్పి కొట్టామని చెప్పింది. పాక్ వైపు మృతుల సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిన పాక్ ఇదే ప్రాంతంలో గత నెలలోనూ ఈ తరహా చొరబాట్లకు, కాల్పులకు పాల్పడిందని సైన్యం తెలిపింది.