స్నేహితుడికి ఆపన్నహస్తం

నవాబ్‌పేట, ఫిబ్రవరి 14 : మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన జక్కని ఆంజనేయులు వైద్య ఖర్చుల నిమిత్తం తన బాల్య స్నేహితులు రూ.25వేల ఆర్థిక సాయం అందజేసి ఉదారతను చాటుకున్నారు. ఆంజనేయు లు తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న 2008-09 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తమవంతు సాయం అందజేశారు. కా ర్యక్రమంలో శేఖర్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్, శే ఖర్, వెంకటేశ్, నరేశ్‌చారి, జగదీశ్‌రెడ్డి, శివ, నిరంజన్, వెంకటేశ్, బాలు, రవిగౌడ్, శేఖర్, రఘు, నరేశ్, రమేశ్, బ్రహ్మం, శివానంద్, ర వీందర్ పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, ఫిబ్రవరి 14 : మండలంలోని వె న్నచేడ్ గ్రామానికి చెందిన కొండా గౌస్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. విష యం తెలుసుకున్న అతడి స్నేహితులు కు టుంబ సభ్యులను పరామర్శించి రూ.42వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు రాములు, షేక్‌అలీ, గౌస్ స్నేహితులు రామకృష్ణ, నాగిరెడ్డి, నాగేంద్రకుమార్, దయానంద్, పులేందర్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు.